భారత్ లో 150 శాతం పెరిగిన డయాబెటీస్ కేసులు.. ఐసీఎంఆర్ కొత్త మార్గదర్శకాలు జారీ..!

భారత్ లో మధుమేహంపై పెరుగుదలపై ఐసీఎంఆర్ ఆందోళన వ్యక్తం చేసింది. మధుమేహం నియంత్రణకు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. గతంలో డయాబెటీస్ రోగులపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ఐసీఎంఆర్ కొత్త మార్గదర్శకాలతో ముందుకొచ్చింది. 

ప్ర‌పంచంలోనే వ‌యోజ‌నుల్లో మ‌ధుమేహ రోగులున్న రెండో అతిపెద్ద దేశంగా భార‌త్ అవ‌త‌రించింద‌ని, గ‌త మూడు ద‌శాబ్ధాలుగా దేశంలో మ‌ధుమేహ రోగులు 150 శాతం పెరుగుతున్నార‌ని ఐసీఎంఆర్ పేర్కొంది. ప్రతి ఆరుగురు మధుమేహుల్లో ఒకరు భారతీయులే అని తెలిపింది.  టైప్-2 డయాబెటీస్ కనిపించే వయసు క్రమంగా తగ్గడం ఆందోళన కలిగిస్తోందని, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 25 -34 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారిలో పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోందని ఐసీఎంఆర్ వెల్లడించింది. 

ఐసీఎంఆర్ మార్గదర్శకాలు

  • టైప్ 1 డ‌యాబెటిస్ నియంత్ర‌ణ‌లో జీవ‌న‌శైలి నిర్వ‌హ‌ణ కీల‌క‌ం.
  • మ‌ధుమేహ వ్యాధి నియంత్ర‌ణ‌లో ఆహార నియ‌మాలు, వ్యాయామం ప్ర‌ధాన పాత్ర పోషిస్తుంది. 
  • బీపీ, బ‌రువు, కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను నియంత్ర‌ణ‌లో ఉంచుకుంటూ శ‌రీర ఎదుగుద‌ల‌కు స‌రైన పోష‌కాహారం తీసుకోవాలి. 
  • మ‌నం తీసుకునే కార్బోహైడ్రేట్ల‌లో 70 శాతం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండేలా చూసుకోవాలి.
  • నిత్యం వ్యాయామం చేయ‌డం ద్వారా శరీరాన్ని చురుకుగా ఉంచ‌డంతో పాటు స్ధూల‌కాయం త‌గ్గించి హృద్రోగ ముప్పును త‌గ్గిస్తుంది.
  • టైప్-1 డయాబెటీస్ బారినపడిన వారు జీవితాంతం ఇన్సులిన్ తీసుకోవాల్సి ఉంటుంది. 
  • ఇన్సులిన్ తీసుకోవడంతో తగు జాగ్రత్తలు పాటించాలి. 
  • ప్రతి ఒక్కరూ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను కూడా ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. 

 

Leave a Comment