ఏపీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం

ఏపీఎస్ ఆర్టీసీ ఆన్ లైన్ టికెట్ బుకింగ్ ను నిలిపివేయాలని నిర్ణయించింది. తెలంగాణకు వెళ్లే బస్సులకు అడ్వాన్స్ టికెట్ రిజర్వేషన్ ప్రక్రియను నిలిపివేసింది. ఏప్రిల్ 14 తరువాత దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ముగుస్తుందని బస్సు సర్వీసులను ప్రారంభించేందుకు ఏపీఎస్ ఆర్టీసీ సిద్ధం అయింది. గత నాలుగు రోజులుగా ఆన్ లైన్ రిజర్వేషన్ టికెట్లను వెబ్ సైట్ లో ఉంచారు. 15 నుంచి 20 వరకు ఆర్టీసీ టికెట్ల రిజర్వేషన్ ను అధికారులు నాలుగు రోజుల క్రితం అందుబాటులోకి తెచ్చారు. 

దీంతో ఊళ్లల్లో ఇరుక్కుపోయిన జనం భారీగా రిజర్వేషన్లు చేసుకున్నారు. ఈ ఆరు రోజులకు వివిధ ప్రాంతాలకు కలిపి 42,377 టికెట్లు ఇప్పటికే బుక్ చేసుకున్నారు. అయితే  ప్రస్తుతం కరోనా కేసులు భారీగా నమోదు కావడంతో తెలంగాన సీఎం కేసీఆర్ లాక్ డౌన్ ను కొనసాగించాలని ప్రధానిని కోరారు. తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగితే రిజర్వేషన్లు కాన్సిల్ చేసి సంబంధిత వ్యక్తులకు పూర్తి సొమ్ము రీఫండ్ చేస్తామని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు.  

Leave a Comment