ఆనందయ్య మందుపై సీఎం జగన్ కు నివేదిక.. కీలక వ్యాఖ్యలు చేసిన ఆయూష్ కమిషనర్..!

కృష్ణపట్నంలో ఆనందయ్య అందించే మందుపై ఆయూష్ పరిశోధన చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ మందుపై నివేదికను ఆయూష్ కమిషనర్ రాములు ఏపీ సీఎం జగన్ కు అందజేశారు.. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ ఆనందయ్య మందుపై ఐదారు రోజుల్లో తుది నివేదిక అందిస్తామని తెలిపారు. చట్టపరంగా ఆయుర్వేద ఔషధంగా చెప్పలేమని, క్లినికల్ ట్రయల్స్ జరిగాకే ఆయుర్వేద ఔషధంగా చెప్పగలమని స్పష్టం చేశారు..

ఆనందయ్య మందులో హానికరమైన పదార్థాలు ఏమీ లేవని, మందులో వాడే మూలికలు ఆయుర్వేద గ్రంథాల్లో ఉన్నవేనని రాములు తెలిపారు. ఆనందయ్య మందుతో ఎలాంటి ప్రమాదం లేదని, పూర్తి నివేదిక వచ్చిన తర్వాత ప్రజలకు పంపిణీ చేయవచ్చని స్పష్టం చేశారు. సీసీఆర్ఏఎస్ నివేదిక వచ్చిన తర్వాత మందు పంపణీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందని తెలిపారు.

ఆనందయ్య ఇప్పటికే 70-80 వేల మందికి మందు పంపిణీ చేశామని చెబుతున్నారని, వేల సంఖ్యలో మందు తీసుకుంటే ఒకరిద్దరికి సమస్యలు వచ్చే అవకాశం ఉందని రాములు అన్నారు. దీన్ని పెద్ద సమస్యగా చూడాల్సిన అవసరం లేదని తెలిపారు. ఆనందయ్య మందు వాడిన 500 మంది డేటా సేకరించామని తెలిపారు. ఇప్పటికే మందులో వాడిన 18 రకాల మూలికలపై అధ్యయనం చేశామని రాములు చెప్పారు.  

 

Leave a Comment