Yellow Fungus : బ్లాక్, వైట్ ఫంగస్ ల కన్నా ప్రమాదకరం..!

ఇప్పటికే కరోనా వైరస్, బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ తో సతమతమవుతున్న ప్రజలకు యెల్లో ఫంగస్ రూపంలో మరో ముప్పు ముంచుకొస్తుంది..ఈ యెల్లో ఫంగస్ బ్లాక్, వైట్ ఫంగస్ లకన్నా మరింత ప్రమాదకరమని వైద్య నిపుణలు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో తొలిసారి ఈ యెల్లో ఫంగస్ కేసును వైద్యులు గుర్తించారు. 

యెల్లో ఫంగస్ ప్రధాన లక్షణాలు..

  • బద్ధకం
  • ఆకలి తక్కువగా ఉండటం లేదా అసలు ఆకలి లేకపోవడం
  • బరువు తగ్గడం

తీవ్ర లక్షణాలు

  • చీము కారడం
  • శరీరం మీద ఉన్న గాయాలు, లోపలి గాయాలు నెమ్మదిగా మానడం
  • పోషకాహార లోపం
  • అవయవాలు వైఫల్యం చెందడం
  • చివరికి నైక్సోసిస్ కారణంగా కళ్లు పోవడం

యెల్లో ఫంగస్ వ్యాప్తికి కారణాలు ఇవే..

యెల్లో ఫంగస్ వ్యాప్తికి ప్రధానంగా అపరిశుభ్ర వాతావరణ కారణం.. కావున ఇంటిని, చుట్టుపక్కల పరిసరాలను సాధ్యమైనంత శుభ్రంగా ఉంచుకోవాలి. బ్యాక్టీరియా, ఫంగస్ పెరుగుదలను నివారించడానికి మిగిలిపోయిన ఆహారాలు, మల పదార్థాలను వీలైనంత త్వరగా తొలగించుకోవాలి. ఇంటిలోని తేమ కూడా బ్యాక్టీరియా, ఫంగస్ పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. సరైన తేమ స్థాయి 30 నుంచి 40 శాతం వరకు ఉంటుంది. కనుక ఇంటిని సాధ్యమైనంత పొడిగా ఉంచుకోవాలి.

Leave a Comment