ఎన్ని సంవత్సరాలు అద్దె కడితే.. ఆ ఇల్లు మీ సొంతమవుతుంది..!

ఎంతో మంది సొంతిల్లు లేక అద్దె ఇళ్లలో ఉంటున్నారు. ఒక ఇంటిని అద్దె తీసుకొని అదే ఇంట్లో కొన్ని సంవత్సరాలుగా ఉంటుంటారు. అయితే అద్దెదారుడు ఒకే ఇంట్లో ఏళ్లపాటు అద్దెకు ఉంటే.. ఇల్లు వారి సొంతమవుతుందా? మరీ చట్టం ఏం చెబుతోంది? ఇప్పుడ తెలుసుకుందాం.. 

చట్టం ఏం చెబుతోంది..

  • అడ్వర్స్ పోసేషన్ ప్రకారం.. ఒక వ్యక్తి ఒకే ఇంట్లో 11 సంవత్సరాలకు పైగా నివసిస్తున్నట్లయితే ఆ వ్యక్తి జీవితాంతం ఆ ఇంట్లో అద్దెకు ఉండవచ్చు. ఒక వేళ అతడు ఇంటి ఓనర్ ప్రమేయం లేకుండా ఆ ఇంటికి ఎలాంటి మరమ్మతులు లేదా రెనోవేషన్ చేయించకపోతే ఆ వ్యక్తి అద్దె కడుతూ జీవితాంతం ఇంట్లోనే ఉండొచ్చు. 
  • ఒక వ్యక్తి ఒకే ఇంట్లో 12 సంవత్సరాలుగా ఉండి ప్రాపర్టీ ట్యాక్స్ కడుతూ ఆ రసీదుపై తన పేరు కలిగి ఉంటే.. కచ్చితంగా ఆ వ్యక్తికి ఓనర్ షిప్ హక్కులు ఉంటాయి. 
  • అదేవిధంగా ఒకే ఇంట్లో 12 సంవత్సరాలు ఉండి ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్, కరెంట్ బిల్లు వంటివి ఓనర్ పేరు మీద ఉన్న ఆ ఇల్లు మీ సొంతం కాదు.. కానీ అద్దెదారుడిగా ఆ వ్యక్తి జీవితాంతం ఆ ఇంట్లో ఉండొచ్చు. అతడిని ఖాళీ చేయించలేరు. 
  • అద్దెకు ఉండే ఇంటికి సంబంధించి ప్రాపర్టీ ట్యాక్స్ అతని పేరు మీద ఉండి ఆ వ్యక్తి వద్ద రిజిస్టర్ సేల్ డీడీ లేకపోతే.. ఓనర్ షిప్ హక్కులు అద్దెకు ఉన్న వ్యక్తికి సొంతమవుతాయి. దీనికి సేల్ డీడీతో సంబంధం లేదు. కానీ ప్రాపర్టీ ట్యాక్స్ ఆ వ్యక్తి పేరు మీద రావాలి అంటే మున్సిపల్ కార్పొరేషన్ లో అద్దెకు ఉండే వ్యక్తి ఓనర్ షిప్ నిరూపించుకోవడానికి టైటిల్ డీడ్ ఇవ్వాలి.  

Leave a Comment