ఇంగ్లీష్ లో అదరకొట్టిన యాచకురాలు.. ఆమె గతం తెలిస్తే షాక్ అవుతారు..!

కొంత మంది ఎలాంటి ఆధారం లేక భిక్షాటన చేస్తుంటారు.. మరి కొంత మందికి అన్ని ఉన్నా.. కుల వృత్తి అని భిక్షం ఎత్తుకుంటారు.. అయితే కొంతమంది గతంలో బాగా బతికి.. అనుకోని కారణాలతో భిక్షాటన చేస్తుంటారు.. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ఇలాంటి వారి టాలెంట్ బయటపడుతుంది. 

తాజాగా ఓ యాచకురాలు ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడటం విని అందరూ షాక్ అయ్యారు.. ఆమె గతం గురించి తెలిసి భావోద్వేగానికి లోనయ్యారు. ఉత్తరప్రదేశ్ లోని వారణాసికి చెందిన స్వాతి అనే యాచకురాలు ఇంగ్లీష్ లో అవలీలగా మాట్లాతున్న వీడియో వైరల్ అవుతోంది. 

దక్షిణ భారతదేశానికి చెందిన స్వాతికి పెళ్లయి ఓ బాబు కూడా ఉన్నాడు. తన డెలివరీ సమయంలో ఆమె కుడి కాలు, కుడి చేతికి పెరాలసిస్ వచ్చంది. దీంతో నడవలేని స్థితిలో చేరుకోవడంతో ఆమెను ఇంట్లో నుంచి గెంటేశారు. ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్న స్వాతి చివరికి వారణాసికి చేరుకుంది. గత మూడేళ్ల నుంచి వారణాసిలోనే భిక్షాటన చేసుకుంటూ జీవితం కొనసాగిస్తోంది.

అయితే స్వాతి తాను బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివినట్లు చెప్పింది. అందుకే ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడుతోంది. కాగా స్వాతి వీడియోను రికార్డ్ చేసిన వ్యక్తి.. తనకు మంచి ఉద్యోగం చూస్తానని హామీ ఇచ్చాడు. ప్రస్తుతం స్వాతి ఇంగ్లీష్ లో మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

 

Leave a Comment