ధోని అనూహ్య నిర్ణయాలు.. అరుదైన వీడియో విడుదల చేసిన ఐసీసీ..!

ఎంతో మంది కెప్టెన్లు ఉన్నా నాయకుడు అంటే అందరికీ గుర్తొచ్చే పేరు మహేంద్ర సింగ్ ధోని.. మైదానంలో ప్రశాంతంగా ఉంటూ తన వ్యూహాలతో ఇండియాకు ఎన్నో మరుపురాని విజయాలను అందించాడు. 15 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూశాడు. ధోని బుధవారం తన 40వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. 

ఈ సందర్భంగా కెప్టెన్ గా తన కెరీర్ లో అతను తీసుకున్న కీలక నిర్ణయాలకు సంబంధించి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ఓ వీడియో రూపొందించింది. ఈ వీడియో ద్వారా ధోనికి బర్త్ డే విషెస్ చెప్పింది. 

ఈ ఐదు నిమిషాల వీడియో 2007 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తో మొదలైంది. ఆ ఫైనల్ చివరి ఓవర్ ను జోగిందర్ శర్మ లాంటి అనామకుడితో వేయించాలని ధోని తీసుకున్న సాహసోపేత నిర్ణయం చాలా మందికి మింగుడుపడలేదు. ఆ తర్వాత ఇలాంటివే ఎన్నో అనూహ్య నిర్ణయాలు కెప్టెన్ గా ధోని తీసుకున్నాడు. 

ఇలాంటి నిర్ణయాలతో 2007 టీ20 వరల్డ్ కప్ తో పాటు 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫి లాంటి విజయాలు సాధించిపెట్టాడు. ఆ వీడియోలన్నింటినీ సంక్షిప్తంగా ఐసీసీ ఇందులో పొందుపరిచింది. ఇలాంటి నిర్ణయాల వల్ల ధోనిని కెప్టెన్ కూల్ అని పిలుస్తారని ఐసీపీ పేర్కొంది. 

Leave a Comment