Happy Birthday MS Dhoni : ధోని ప్రయాణం.. మైలురాళ్లపై ఒక లుక్..!

మహేంద్ర సింగ్ ధోని.. ఈ పేరు వింటేనే ఓ వైబ్రేషన్.. భారత దేశానికి రెండు ప్రపంచ కప్ లు అందించిన కెప్టెన్.. ప్రపంచ క్రికెట్ లో మూడు ఐసీసీ ట్రోఫీలు అందుకున్న ఏకైక కెప్టెన్.. తన నాయకత్వంలో టీమిండియాను నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టిన కెప్టెన్ ధోని.. భారత అత్యుత్తమ కెప్టెన్ గా నిలిచిన ధోని నేడు 40వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు.. ఈ సందర్భంగా ధోని పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి..

ధోని కెరీర్ పరిశీలిస్తే..

  • 1981 జూలై 7న జార్ఖండ్ లోని రాంచీలో జన్మించాడు..
  • 1999లో రంజీ అరంగేట్రం చేశాడు..
  • 2001లో ఖరగ్ పూర్ రైల్వే స్టేషన్లో టీటీఈ(ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్) గా ఉద్యోగం వచ్చింది.
  • 2004, డిసెంబర్ 23న బంగ్లాదేశ్ తో మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేశాడు. 
  • 2005, డిసెంబర్ 2న చిదంబరం స్టేడియంలో శ్రీలంకతో మ్యాచ్ తో టెస్ట్ క్రికెట్ లో అరంగేట్రం చేశాడు. 
  • 2006 డిసెంబర్ 1న ద వాండరర్స్ స్టేడియంలో సౌతాఫ్రికాతో మ్యాచ్ ద్వారా టీ20 క్రికెట్ లో అరంగేట్రం చేశాడు. 
  • అంతర్జాతీయ క్రికెట్ లో పరిమిత ఓవర్ల ట్రోఫీలన్నింటినీ గెలిచిన ఏకైన కెప్టెన్ గా ధోని నిలిచాడు. 2007లో టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీలను భారత్ కు అందించాడు. 

ధోనికి వచ్చిన అవార్డులు:

  • 2007లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న
  • 2008,2009లలో ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్.. ఈ అవార్డును రెండు సార్లు గెలుచుకున్న తొలి ప్లేయర్ ధోనినే..
  • 2009కు భారత ప్రభుత్వం పద్మశ్రీ అందించింది. 
  • 2018లో పద్మ భూషణ్ అవార్డు అందుకున్నాడు. 

ఎక్కువ మ్యాచులకు కెప్టెన్ గా:

మహేంద్ర సింగ్ ధోని మొత్తంగా 332 అంతర్జాతీయ మ్యాచ్ లకు సారధ్యం వహించాడు. ఇది ప్రపంచ రికార్డు. ఈ వ్యవధిలో అతడు 11,207 పరుగులు చేశాడు. ఇందులో 11 సెంచరీలు, 71 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 200 వన్డేలు, 60 టెస్టులు, 72 టీ20 మ్యాచుల్లో ధోని భారత్ కు కెప్టెన్సీ వహించాడు. 

ధోని రికార్డులు:

  • 195 అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక స్టంపింగ్ లు చేశాడు. 
  • కెప్టెన్ గా అత్యధికంగా 150 టీ20 విజయాలు సాధించిన తొలి అటగాడు ధోని.
  • వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు 183 సాధించిన వికెట్ కీపర్..
  • వన్డేల్లో ఎక్కువ సార్లు నాటౌట్ గా నిలిచిన ప్లేయర్.. 84 మ్యాచుల్లో నాటౌట్ ఉన్నాడు. 
  • టెస్టుల్లో డబుల్ సెంచరీ(224) చేసిన ఏకైక భారత వికెట్ కీపర్.
  • అంతేకాదు అంతర్జాతీయ క్రికెట్ లో ఫాస్టెస్ట్ స్టంపింగ్ చేసిన కీపర్ ధోనినే.. 0.08 సెకన్లలో ధోని స్టంపింగ్ చేశాడు. 

ఇక 2020 ఆగస్టు 15న రాత్రి 7.29 గంటలకు ధోని అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చాడు. తన 16 ఏళ్ల కెరీర్ లో అటు నాయకుడిగా, ఇటు ఆటగాడిగా ప్రశంసలతో పాటు ఎనలేని క్రేజ్ ను సొంతం చేసుకున్న ధోని ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని ఆశిద్దాం..

Leave a Comment