రైతులకు మద్దతుగా తుపాకీతో కాల్చుకున్న మత గురువు..!

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు. ఆందోళనలు చేస్తున్న రైతులకు సంఘీభావంగా హరియాణాలోని కర్నాల్ కు చెందిన మత ప్రబోధకుడు సంత్ బాబా రామ్ సింగ్(65) బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఢిల్లీలోని సింఘూ సరిహద్దు వద్ద తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నారు. 

బాబా రామ్ సింగ్ తన ఆత్మహత్యకు గల కారణాలను వివరిస్తు రాసిన ఆత్మాహుతి లేఖ లభించింది. హక్కుల కోసం రోడ్డుపై ఆందోళన చేస్తున్న రైతుల దీన స్థితిని, వారికి న్యాయం చేయకుండా ప్రభుత్వం అనుసరిస్తున్న అణచివేతను చేసి తట్టుకోలేకపోతున్నానని ఆ లేఖలో ఆయన రాశారు.

 ‘రైతుల్లో బాధను చూస్తున్నా. వారి హక్కుల కోసం రైతులు పోరాడుతున్నారు. ప్రభుత్వం వారికి న్యాయం చేయడం లేదు. వారి బాధను నేను పంచుకుంటున్నా. అన్యాయం చేయడం పాపం. అన్యాయాన్ని ఉపేక్షించడం కూడా పాపమే. రైతులకు మద్దతు పలికేందుకు కొందరు అవార్డులను ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేశారు. నేనే నన్ను త్యాగం చేయాలని నిర్ణయించుకున్నా’ అంటూ సూసైడ్ లేఖలో బాబా రామ్ సింగ్ పేర్కొన్నారు. ఈ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

 

Leave a Comment