అంగన్ వాడీ కేంద్రం పాలప్యాకెట్ లో కప్ప..!

అంగన్ వాడీ కేంద్రంలో పంపిణీ చేస్తున్న విజయ వజ్ర పాలప్యాకెట్ లో కప్ప దర్శనమిచ్చింది. ఈ ఘటన అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం రాయంపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకంది. వివరాల మేరకు గ్రామంలోని అంగన్ వాడీ కేంద్రంలో నాలుగు రోజుల క్రితం పాలప్యాకెట్లు పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన బాలింత ఇంద్రజ డైలీ అంగన్ వాడీ పాకెట్లను వినియోగిస్తోంది. 

ఎప్పటిలాగే పాలప్యాకెట్ ఓపెన్ చేసి గిన్నెలో పాలు పోయగా దుర్వాసన వచ్చింది. దుర్వాసన ఎందుకు వస్తుందని పాలను పరిశీలించగా అందులో చనిపోయిన కప్ప కనిపించింది. దీంతో ఆమె భయాందోళనకు గురైంది. ఈ విషయాన్న వెంటనే అంగన్ వాడీ కార్యకర్తకు సమచారం ఇచ్చారు. 

ఐసీడీఎస్ అధికారులు అంగన్ వాడీ సిబ్బందిని, బాలింతన విచారించారు. వివరాలు నమోదు చేసుకుని ప్యాకెట్ బ్యాచ్ నెంబర్, సరఫరా చేసిన యూనిట్ పై దర్యాప్తు చేస్తున్నారు. అంగన్ వాడీ కేంద్రాన్ని ఐసీడీఎస్ అధికారులు తనిఖీ చేశారు. బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు. 

  

Leave a Comment