భారత్ లో మతస్వేచ్ఛ ప్రమాదకరం : అమెరికా..

భారత దేశంలో ఎన్నో సంవత్సరాలుగా మతసామరస్యం వెల్లివిరిస్తోంది.  అయితే ప్రస్తుత పరిణామాల దృష్ట్యా భారతదేశంలో మతస్వేచ్ఛ విషయంలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని అమెరికా దౌత్యవేత్త సామ్యూల్ బ్రౌన్ బాక్ వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో మతస్వేచ్ఛకు సంబంధించిన ఉల్లంఘనలను రికార్డును ఇంటర్నేషనల్ రిలిజియన్ ఫ్రీడమ్ సంస్థ తయారు చేస్తుంది. ‘2019 అంతర్జాతీయ మత స్వేచ్ఛ నివేదిక’ను అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి మైక్ పాంపియో విడుదల చేశారు. 

ఇంటర్నేషనల్ రిలిజియన్ ఫ్రీడమ్ సంస్థకు అంబాసిడర్ గా అట్ లార్జ్ గా సామ్యూల్ బ్రౌన్ బాక్ వ్యవహరిస్తున్నారు. నివేదిక వెలువడిన కొన్ని గంటల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన భారత్ పై వ్యాఖ్యలు చేశారు. భారత్ లో పరిణామాలు జీర్ణించుకోవడానికి కష్టంగా ఉన్నాయన్నారు. తాము ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితులను చక్కదిద్దడానికి ఉన్నత స్థాయిలో భారత్ అంతర్గత చర్చలు ప్రారంభిచాలన్నారు. మత స్వేచ్ఛపై భారత్ ప్రధానంగా దృష్టి పెట్టకపోతే హింత మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. 

 

Leave a Comment