మాజీ మంత్రి అచ్చెన్నాయుడి అరెస్టు..!

ఈఎస్ఐ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు తెల్లవారుజామున అరెస్టు చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఆయనను అరెస్టు చేసి విజయవాడకు తరలించారు. ఈఎస్ఐ లో భారీ కుంభకోణం జరిగినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ ఇటీవల బయటపెట్టింది. ఈ కేసు విచారణలో భాగంగా అచ్చెన్నాయుడిని ఏసీబీ అదుపులోకి తీసుకుంది. 

నామినేషన్ పద్ధతిలో అచ్చెన్నాయుడు టెండర్లు ఇప్పించారని రిపోర్ట్ లో తేలింది. టెలీ హెల్త్ సర్వీసుల పేరుతో ఆర్డర్స్ ఇవ్వడంలో అచ్చెన్నాయుడు ఒత్తిడి తెచ్చారని, నామినేషన్ల పద్ధతిలో కేటాయించాలని ఆదేశించారని విచారణలో వెలుగులోకి వచ్చింది. దీంతో ఎసీబీ ఆయనను అరెస్టు చేసింది. 

ఈఎస్ఐ గత ఆరేళ్లలో కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని తేలింది. లేని కంపెనీల నుంచి నకిలీ కోటేషన్లు తీసుకొని ఆర్డర్లు ఇచ్చినట్టు అధికారులు గుర్తించారు. రేట్ కాంట్రాక్ట్ లో లేని కంపెనీలకు ఈఎస్ఐ డైరెక్టర్లు రూ.51 కోట్లు చెల్లించినట్లు తేలింది.

ఈ మొత్తం వ్యవహారంలో ఈఎస్ఐ డైరెక్టర్ ఇద్దరిని బాధ్యులుగా గుర్తించారు. మందులు పరికరాల వాస్తవ ధరకంటే 136శాతం అధికంగా సంస్థలు టెండర్లు చూపించినట్టు విచారణలో తేలింది. తద్వారా అక్రమంగా రూ.85 కోట్లు చెల్లించినట్టు విచారణలో తేలింది. ఈ స్కామ్ లో ఇప్పటికే ఒక డాక్టర్ అరెస్ట్ అయ్యాడు. అతడు ఇచ్చిన ఆధారాల ప్రకారం అచ్చెన్నాయుడి బండారం బయటపడినట్లు సమాచారం. 

ఏపీ ఈఎస్ఐలో దాదాపు రూ.151 కోట్ల అవినీతి జరిగిందని విజిలెన్స్ రిపోర్టులో తేలింది. లేని కంపెనీల నుంచి నకిలీ కొటేషన్లు తీసుకుని అచ్చెన్నాయుడు ఆర్డర్లు ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. రూ.988 కోట్ల కొనుగోళ్లలో ఆయన పాత్ర ఉన్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. 

Leave a Comment