భారీగా తగ్గిన పెట్రోల్ ధరలు

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. వరుసగా మూడెో రోజు ధరలు క్షీణించాయి. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో శనివారం పెట్రోలుపై 24 పైసలు, డీజిల్ పై 27 పైసలు ధర తగ్గింది. ఫిబ్రవరి మొత్తంలో పెట్రోల్ లీటర్ కు 82 పైసలు, డీజిల్ లీటర్ కు 85 పైసలు తగ్గింది. 

ముడి చముర ధరలను కూడా కరోనా వైరస్ ప్రకంపనలు తాకాయి. చమురుకు డిమాండ్ ఎక్కువ ఉండే చైనాలో కరోనా వైరస్ వ్యాప్తితో చమురు వాణిజ్యం తీవ్రంగా ప్రభావితమైంది. దీంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధర గత వారం పడిపోయింది. వారంలో వరుసగా ఐదో సారి క్షీణించింది. 

ధరలు :

హైదరాబాద్ : లీటర్ పెట్రోల్ ధర రూ.77.08, డీజిల్ ధర రూ.71.35

విజయవాడ : లీటర్ పెట్రోల్ ధర రూ.76.63, డీజిల్ ధర రూ.70.91

ముంబై : లీటర్ పెట్రోల్ ధర రూ.78.11, డీజిల్ ధర రూ.68.57

ఢిల్లీ : లీటర్ పెట్రోల్ ధర రూ.72.45, డీజిల్ ధర రూ.65.43

కోల్ కతా : లీటర్ పెట్రోల్ ధర రూ.7 5.13, డీజిల్ ధర రూ.67.79

చెన్నై : లీటర్ పెట్రోల్ ధర రూ.75.27, డీజిల్ ధర రూ.69.10

Leave a Comment