రూ.100 నోట్లను రద్దు చేయనున్న ఆర్బీఐ?

కేంద్ర ప్రభుత్వం ప్రజలకు మరో షాక్ ఇవ్వనుంది. మార్చి లేదా ఏప్రిల్ నాటికి రూ.100, రూ.10, రూ.5 తో సహా పాత కరెన్సీ నోట్లను రద్దు చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యోచిస్తున్న ఆర్బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ బి.మహేష్ వెల్లడించారు. జిల్లా పంచాయతీలోని మంగళూరు, నేత్రావతి హాల్ లో జిల్లా లీడ్ బ్యాంక్ ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి భద్రతా కమిటీ, జిల్లా స్థాయి కరెన్సీ మేనేజ్మెంట్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 రూపాయల నాణెం ప్రవేశపెట్టి 15 ఏళ్ల తర్వాత కూడా వ్యాపారులు, వ్యాపారవేత్తలు సహా చాలా మంది వాటిని అంగీకరించడం లేదన్నారు. నకిలీవని వారు అనుమానిస్తున్నారని, దీంతో బ్యాంకులు, ఆర్బీఐకి ఇది సమస్యగా మారిందని అన్నారు. ఈ నేపథ్యంలో 10 రూపాయల నాణెంపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే పాత సిరీస్ నోట్ల ముద్రణను 6 నెలలుగా ఆర్బీఐ నిలిపివేసింది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

 

Leave a Comment