‘నవ రంద్రాల్లో సీసం పోస్తా’.. ఫుల్ మాస్ గా ‘క్రాక్’ ట్రైలర్..!

మాస్ మహరాజ రవితేజ హీరోగా నటించిన ‘క్రాక్’ ట్రైలర్ (Krack Trailer) రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ లో హీరో రవితేజ అద్భుతమైన నటనతో సూపర్ డైలాగులతో అదరగొట్టాడు. ఫుల్ మాస్ డైలాగులతో రవితేజ స్టయిల్ లో ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ సినిమాకు గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్ గా శ్రుతి హాసన్ నటించింది. వరలక్ష్మీ శరత్ కుమార్ విలన్ పాత్రలో కనించనున్నారు. తమన్ సంగీతం అందించారు. 

‘క్రాక్’ (Krack) సినిమాలో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాపై ఉన్న అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ట్రైలర్ ఉంది. ‘చూశారా..జేబులో ఉండాల్సిన నోటు, చెట్టుకు ఉండాల్సిన కాయ, గోడకు ఉండాల్సిన మేకు ఈ మూడు..ముగ్గురు తోలుల్ని తొక్కేశాయి.. ఇక్కడ కామన్ పాయింట్ ఏంటంటే.. ఈ ముగ్గురితో ఆడుకుంది ఒకే పోలీసోడు’ అంటూ విక్టరీ వెంకటేష్ స్వరంతో ట్రైలర్ స్టార్ట్ అయింది. 

‘శంకర్.. ష్యూర్ షాట్.. నో డౌట్. పుచ్చె పేలిపోద్ది’,  ‘శంకర్.. పోతురాజు వీర శంకర్, ఒంగోలు నడి సెంటర్ లో నగ్నంగా నిలబెట్టి నవరంద్రాల్లో సీసం పోస్తా నా కొడకా’, అంటూ రవితేజా చెప్పిన మాస్ డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ ట్రైలర్ తో అభిమానుల్లో ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయిని మించి పోయాయి. ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.    

 

Leave a Comment