బ్రహ్మానందం పెయింటింగ్ అదుర్స్..!

ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం అద్భుతమైన నటుడే కాదు…ఆయనలో మంచి ఆర్టిస్ట్ కూడా ఉన్నారు. ఇప్పటికే పలు మార్లు ఆయన పెయింటింగ్ వేస్తూ కనిపించారు. పలు ఆర్ట్ చిత్రాలను గీశారు. గతంలో శ్రీరాముడు, ఆంజనేయుడిని హత్తుకున్న ఫొటోను షేర్ చేశారు. ఆ ఫొటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. 

తాజాగా న్యూఇయర్ గిఫ్ట్ గా కొత్త పెయింటింగ్ వేశారు. ఈ సారి శ్రీవెంకటేవ్వరస్వామి చిత్రాన్ని గీశారు. శ్రీవెంకటేశ్వరస్వామికి అర్చకుడు పూజ చేస్తున్నట్లుగా ఆ ఆర్ట్ ఉంది. ప్రస్తుతం ఆ పెయింటింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన అభిమానులు దీన్నీ షేర్ చేసుకుంటూ అభినందనలు తెలియజేస్తున్నారు. 

Leave a Comment