చైనాలో ఆకాశంలో అరుదైన దృశ్యం.. ఒకేసారి మూడు సూర్యుళ్లు..!

చైనాలో అకాశంలో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. తుఖియాంగ్ పట్టణంలో ఒకేసారి మూడు సూర్యుళ్లు దర్శనమిచ్చారు. ఏకంగా మూడు గంటల పాటు ఆకాశంలో అవి కనిపించాయి. ఉదయం 6.30 గంటల నుంచి ఉదయం 9.30 గంటల వరకు ఈ అపురూపం కొనసాగింది. ఈ విధంగా మూడు సూర్యళ్లు కనిపించడాన్ని సన్ డాగ్ గా పిలుస్తారు. ఈ వింతను చూసిన ప్రజలు ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్ గా మారాయి. ఈ మూడింటిలో మధ్యలో ఉన్నది అసలైన సూర్యుడు. ఇరువైపులా ఉన్నవి సూర్యుళ్లా కనిపించే. వాటిని ఫాంటమ్ సూర్యుళ్లు అంటారు. చైనాలో అప్పుడప్పుడు ఇలా ఒకేసారి మూడు సూర్యుళ్లు లేదా ఐదు సూర్యుళ్లు దర్శనమిస్తుంటాయి. 

Leave a Comment