6 బంతులు యార్కర్లు వేయాలన్న షమీ నిర్ణయంపై ఆశ్చర్యపోయాం : రాహుల్

ఐపీఎల్ చరిత్రలోనే మొదటిసారి సూపర్+సూపర్ మ్యాచ్ ముంబై ఇండియన్స్ మరియు పంజాబ్ ల మధ్య ఆదివారం జరిగింది. అత్యంత ఉత్కంఠ మ్యాచ్ లో పంజాబ్ విజేతగా నిలిచింది. చారిత్రాత్మక విజయంలో తన ఉనికిని చాటుకున్న పేస్ బౌలర్ మహ్మద్ షమీపై పంజాబ్ కెప్టెన్ కెఎల్ రాహుల్ ప్రశంసలు కురిపించాడు.

 తొలిసూపర్ ఓవర్ లో ముంబై నిర్దేశించిన లక్ష్యాన్ని కాపాడుకోవాలంటే ఆరు బంతులు యార్కర్లు వేయాలని షమీ అనుకున్నాడని రాహుల్ తెలిపాడు. ఆరు బంతులు కూడా యార్కర్లు వేద్దామనుకుంటున్నానని షమీ చెప్పడంతో అందరం ఆశ్చర్యానికి గురయ్యామన్నాడు. షమీ నిర్ణయాన్ని తాము, మిగతా సీనియర్ ఆటగాళ్లు స్వాగతించామని తెలిపాడు. తన ప్లాన్ పక్కాగా అమలు చేసి జట్టుకు చారిత్రక విజయాన్ని అందించాడని రాహుల్ తెలిపాడు. 

కాగా, టాస్ గెలిచి బ్యాగింగ్ ఎంచుకున్న ముంబై 20 ఓవర్లకు 176 పరుగులు చేసింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కూడా 176 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్ టై అయింది. దీంతో అంపైర్లు సూపర్ ఓవర్ ఆడించారు. తొలి సూపర్ ఓవర్ లో పంజాబ్ 5 పరుగులే చేయగలిగింది.

 ముంబై బౌలర బుమ్రా చక్కని యార్కర్లతో పంజాబ్ ను కట్టడి చేశాడు. కేవలం ఆరు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై స్వల్ప లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. పంజాబ్ బౌలర్ మహ్మద్ షమీ యార్కర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో ముంబై కూడా ఐదు పరుగులకే పరిమితమైంది. దీంతో ఈ ఓవర్ టై అయింది. దీంతో అంపైర్లు మరో సూపర్ ఓవర్ ఆడించారు. ఈసారి ముంబై 11 పరుగులు చేసింది. తర్వాత పంజాబ్ జట్టు 15 పరుగులు చేయడంతో గెలిచింది.  

 

Leave a Comment