ఆకాశంలో అరుదైన తోకచుక్క కనువిందు..!

ఆకాశంలో అద్భుతం  జరగనుంది. 20 రోజుల పాటు ఓ తోకచుక్క కనువిందు చేయబోతుంది. ఆకాశంలో నియోవైజ్ అనే తోకచుక్క 20 రోజుల పాటు కనిపిస్తుంది. దీనికి మనం చూడటం మిస్సయితే దీనిని మళ్లీ చూడలేం..ఎందుకంటే ఇది కనబడేది మరో 6వేల ఏళ్ల తర్వతే..ఈ తోకచుక్క వెడల్పు ఐదు కిలోమీటర్లు ఉంటుంది. ఈ భారీ తోకచుక్క తన కక్ష్యలో తిరుగుతూ భూమికి అతి దగ్గరగా వస్తుంది. ఈ క్రమంలో భారత్ లో వాయువ్యం దిశలో జూలై 14 నుంచి 20 రోజుల పాటు ఆకాశంలో కనిపిస్తుంది. 

ఈ తోకచుక్కను మనం కంటితో చూడవచ్చు. ఈ అరుదైన నియోవిస్ తోకచుక్క సుర్యాస్తమం తర్వాత వాయువ్య భాగంలో 20 నిమిషాల పాటు కనిపిస్తుంది. జూలై 22, 23 తేదీల్లో ఈ తోకచుక్క భూమికి 103 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుందని, ఆ రోజు మరింత స్పష్టతతో చూడవచ్చని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ తోకచుక్క చూడటానికి ఎలాంటి పరికరాలు అవసరం లేదని చెబుతున్నారు.

Leave a Comment