మీ పిల్లలు అర్ధరాత్రి వరకు ఫోన్ లో బిజీగా ఉంటున్నారా ? అయితే తప్పకుండా ఇవి తెలుసుకోవాలి..

మీ పిల్లలు అర్ధరాత్రి వరకు నిద్రపోకుండా మొబైల్ ఫోన్ చూస్తున్నారా? అయితే మీరు కొంచం జాగ్రత్తగా ఉండాల్సిందే..అర్ధరాత్రి వరకు మొబైల్ తో బిజీగా ఉండే టీనేజ్ పిల్లలపై ఇటీవల జరిపిన అధ్యయనాల్లో ఆందోళనకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. తరచుగా మొబైల్ వాడే పిల్లలు అనేక రకాల శారీరక సమస్యలను ఎదుర్కొంటారని తేలింది. 

కెనడాకు చెందిన పరిశోధకులు వెయ్యి మందికిపైగా యువకులను పరిశీలించారు. అర్ధరాత్రి వరకు మొబైల్ వాడే యువకులు అనేక రకాల శారీరక సమస్యలు ఎదుర్కొంటున్నారని పరిశోధకులు చెబుతున్నారు. అర్ధరాత్రి వరకు మొబైల్ తో బిజీగా ఉండి ఉదయం నిద్రపోయే టీనేజర్లు కంటి, జీర్ణ సమస్యలు మాత్రమే కాకుండా వారు మానసికంగా కూడా బాధపడుతున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది.

టీనేజ్ పిల్లల ఆరోగ్యం బాగుండాలంటే కెనడియన్ శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..టీనేజ్ యువకులు సమయానికి నిద్రపోవాలని సూచిస్తున్నారు. అంతే కాకుండా నిద్రపోయే రెండు లేదా మూడు గంటల ముందు భోజనం చేయాయాలని చెప్పారు. రాత్రి ఎక్కువ సేపు మేల్కొనే వారి శరీరం సరిగ్గా సహకరించదని, వారిలో వ్యాధినిరోధక శక్తి కూడా తగ్గుతుందని అధ్యయనంలో వెల్లడైంది. దీంతో వారికి పలు రకాల శారీరక సమస్యలు ఎదురవుతాయని చెబుతున్నాయి. ఇది మాత్రమే కాదు..మొబైల్, టాబ్లెడ్, ఐప్యాడ్ మొదలైన వాటి నుంచి వెలువడే బ్లూ లైట్ కంటి తేమను తగ్గించడమే కాక, మెదడులోని కొన్ని భాగాలపై కూడా ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. అందువల్ల రాత్రి సమయంలో ఆలస్యంగా నిద్రపోకుండా త్వరగా నిద్రపోయి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. 

 

Leave a Comment