ఆటో డ్రైవర్ మానవత్వం.. కరోనా పేషంట్లకు ఉచిత ప్రయాణం..!

జార్ఖండ్ రాంచీకి చెందిన ఓ ఆటో డ్రైవర్ కోవిడ్ పేషంట్లకు తన వంతు సాయం చేస్తూ మానవత్వం చాటుకున్నాడు. తన ఆటోలో ప్రయాణించే కరోనా రోగులకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నాడు. అంతేగాక సోషల్ మీడియాలో తన ఫోన్ నెంబర్ ని పెట్టాడు. ఆటోకి కూడా ఫోన్ నెంబర్ తో ఉన్న పోస్టర్ ని అతికించాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కోవిడ్ రోగులను ఆస్పత్రికి తీసుకెళ్తున్నాడు. వారి నుంచి ఎలాంటి డబ్బులు వసూలు చేయడం లేదు. 

ఇలా ఎందుకు చేస్తున్నాడంటే.. ఈనెల 15న కోవిడ్ సోకిన ఓ మహిళను రిమ్స్ హాస్పిటల్ లో దింపగా ఆ తర్వాత ఆమెని ఆమెను తీసుకెళ్లడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో మహిళ ఆ రోజు పడిన వేదన చూసినప్పటి నుంచి ఈ ఉచిత ప్రయాణం ప్రారంభమైందని అన్నాడు. ఈ ఆటో డ్రైవర్ చేస్తున్న సహాయానికి స్థానికులే కాదు నెటిజన్లు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. 

Leave a Comment