ఆయోధ్యలో 161 అడుగుల ఎత్తయిన రామాలయం 

అయోధ్యలో 161 అడుగుల ఎత్తయిన రామాలయాన్ని నిర్మించాలని నిర్ణయించారు. ఆగస్టు 5న ప్రధాని మోడీ భూమి పూజ చేయనున్నారు. ఆలయం అసలు నమూనాను 1988లో 141 అడుగులుగా నిర్దేశించారు. కానీ దానిని 20 అడుగులు పెంచి నిర్మించాలని ఆర్కిటెక్ట్  మరియు ఆలయ ప్రధాన వాస్తు శిల్పి కుమారుడు నిఖిల్ సోంపురా తెలిపారు. 

మునుపటి రూపకల్పన ఆధారంగా స్తంభాలు, రాళ్లను చెక్కుతున్నామని చెప్పారు. ఇంకా రెండు మండపాలను జోడించామన్నారు. ఆలయ నిర్మాణానికి మూడున్నర సంవత్సారాలు పడుతుందని సోంపురా పేర్కొన్నారు. ఆగస్టు 3 నుంచి మూడు రోజుల పాటు హోమాలు జరుగుతాయి. 40 కిలోల వెండి ఇటుకను ప్రధాని మోడీ పునాది రాయిగా ఏర్పాటు చేయడం ద్వారా భూమి పూజ మొదలవుతుంది. కరోనా వ్యాప్తి కారణంగా రెండు నెలలు ఆలస్యం అయిన ఈ కార్యక్రమానికి 50 మందికిపైగా వీఐపీలు హాజరుకానున్నారు. భక్తులు చూసేందుకు అయోధ్య అంతటా జెయింట్ సిసి టివి స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు.    

 

Leave a Comment