ఇళ్లలోనే రంజాన్ ప్రార్థనలు..

కరోనా వైరస్ దేశంలో పంజా విసురుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. దీంతో ఉలేమాలు, ముఫ్తీలు, ఇస్లామిక్ స్కాలర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో పవిత్ర నెల రంజాన్ తారావీహ్ నమాజ్ లను ఇళ్లలోనే పూర్తి చేసుకోవాలని కోరారు. ఈ మేరకు జామియా నిజామియా గురువారం ప్రకటించింది. 

రంజాన్ నెలలో ఉపవాస దీక్షల సందర్భంగా సహర్ తో పాటు ఇఫ్తార్ లను కూడా ఇళ్లలోనే చేసుకోవాలని కోరింది. డబ్బులు వృధా చేయకుండా పేదలను ఆదుకోవాలని సూచించింది. లాక్ డౌన్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని కోరింది. 

జామియా నిజామియా నిర్ణయాన్ని ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్వాగతించారు. కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించినందుకు ఇది మంచి సందేశమని ఆయన ట్విట్ చేశారు. అన్ని ముస్లిం పాఠశాలలకు మార్గదర్శకాలు జారీ చేశారని, వీటిని ఏపీ, తెలంగాణ లోనే కాకుండా దేశ వ్యాప్తంగా పాటించాలని కోరారు.

Leave a Comment