‘నీకింకా బుద్ధి రాలేదా’.. సుమంత్ రెండో పెళ్లిపై వర్మ పంచ్..!

టాలీవుడ్ హీరో సుమంత్ త్వరలో రెండో పెళ్లి చేసుకోబోతున్నాడంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ మేరకు సుమంత్ – పవిత్ర పేరుతో పెళ్లి కార్డు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వార్తలపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించాడు. 

‘ఒకసారి అయ్యాక కూడా నీకింకా బుద్ధి రాలేదా సుమంత్? నీ ఖర్మ, ఆ పవిత్ర ఖర్మ.. అనుభవించండి’ అని ట్వీట్ చేశాడు. ఇక మరో ట్వీట్ లో ‘ఒక పెళ్లే నూరెళ్ల పెంటయితే.. రెండో పెళ్లంటయ్యా సామీ.. నా మాట విని మానేయ్యి.. పవిత్ర గారూ.. మీ జీవితాలను పాడు చేసుకోకండి.. తప్పు మీది.. సుమంత్ ది కాదు.. తప్పు ఆ దౌర్భాగ్యపు వ్యవస్థది’ అంటూ రాసుకొచ్చాడు. 

సుమంత్ అంతకుముందు 2004లో హీరోయిన్ కీర్తిరెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు. ఈనేపథ్యంలో సుమంత్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే సుమంత్ పెళ్లిపై అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది.  

Leave a Comment