శ్రీశైలానికి భారీ వరద నీరు.. 10 గేట్లు ఎత్తివేత..!

శ్రీశైలం జలాశయానికి భారీ వరద నీరు వస్తోంది. ఇన్ ఫ్లో రూపంలో 4,60,154 క్యూసెక్కుల నీరు వచ్చి జలాశయానికి చేరుతోంది. దీంతో  అధికారులు 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తంగా 3.40 లక్షల క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయం నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు.

శ్రీశైలం జలాశయం పూర్తిస్తాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటి మట్టం 884.40 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం డ్యామ్ లో 212.4385 టీఎంసీల నీరు ఉంది. శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తడంతో పర్యాటకులు శ్రీశైలానికి క్యూ కడుతున్నారు.  

Leave a Comment