ఆర్జీవీ ఏంటిది.. అషు రెడ్డికి అక్కడ ఫొటో తీసిన వర్మ..వీడియో వైరల్..!

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఏం చేస్తాడో తెలిదు.. ఎవరికీ ఎలాంటి కామెంట్ చేస్తాడో చెప్పలేం. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో ఆర్జీవీ చేసే వేషాలు ఎబ్బెట్టుగా ఉంటున్నాయి. ఇటీవల బిగ్ బాస్ బ్యూటీ అరియానాతో ఇచ్చిన ఇంటర్వ్యూలో పచ్చిగా మాట్లాడాడు. తన ఇంటర్వ్యూ కోసం వచ్చిన లేడీ యాంకర్స్ ను రామ్ గోపాల్ వర్మ తనదైన మాటలు, చేష్టలతో పొగిడేస్తుంటాడు.  

తాజాగా మరో బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసింది. ఆమెతో ఇంటర్వ్యూ సమయంలో బల్ల కిందకు వంగి తన మొబైల్ కెమెరాతో అషురెడ్డి తొడలను షూట్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను అషురెడ్డి తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ‘నో అంటే నో అంతే’ అని క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ క్లిప్ వైరల్ గా మారింది. 

 

View this post on Instagram

 

A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu)

ఈ వీడియోలో ఆర్జీవీ ఆమె తొడలను తన కెమెరాతో రికార్డు చేస్తుంటే.. అషు మాత్రం వద్దు వద్దు అని చెప్పడం కనిపిస్తుంది. ఈనేపథ్యంలో నెటిజన్లు కూడా అషు రెడ్డిపై కామెంట్లు చేస్తున్నారు.. ఆర్జీవీతో ఇంటర్వ్యూ అంటే దుస్తుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని, అలా పొట్టి దుస్తులు వేస్తే అతడి చూపు అక్కడే ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు.   

అయితేే ఈ పోస్టుపై ఆర్జీవీ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. ‘అందులో ఎడమవైపు ఉన్నది నేను కాదు. కుడి వైపు ఉన్నది అషు రెడ్డి కాదు. ఈ ఇంటర్వ్యూ మేము చేయలేదు. దేవుళ్ల మీద ఒట్టు.. కానీ దేవతల మీద కాదు’ అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు. దీంతో నెటిజన్లు ఆర్జీవీని ఆడేసుకుంటున్నారు. నువ్వు ఎవరినీ వదలవా సామీ అంటూ ప్రశ్నిస్తున్నారు.  

Leave a Comment