జుట్టు కాపాడుకునేందుకు జాగ్రత్తలు..!

ప్రస్తుతం వయస్సుతో తేడా లేకుండా జట్టు రాలడం అనేది సాధారణం అయిపోయింది. పని ఒత్తిళ్లు, పోషకాహారం లేకపోవడం వంటి కారణాలతో చాలా మందిలో జుట్టు రాలిపోతుంది. జుట్టు విషయంలో చాలా మంది పొరపాట్లు చేస్తుంటారు. జుట్టు ఊడిపోతుందని బాధపడుతూ ఉంటారు. అయితే జుట్టును కాపాడుకోవాలంటే రోజువారీగా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. అవి ఏంటంటే..

జుట్టును అతిగా దువ్వకండి:

చాలా మంది రోజూ చేసే పొరపాట్లలో ఇది ముఖ్యమైంది. అదే పనిగా జుట్టును దువ్వుతుంటారు. మాడుకు రక్తప్రసరణ బాగా అందుతుంది, జట్టు మృదువుగా, మెరుపుగా అవుతుందని జుట్టును ఎక్కువగా దువ్వుతారు. దీని వల్ల సహజసిద్ధ తైలంలో మాడు భాగంలో అన్ని వెంట్రుకలకు అందుతాయి. 

కానీ ఎనిమిది, తొమ్మిది సార్ల కంటే ఎక్కువగా జుట్టున దువ్వనవసరం లేదు. ఎక్కువ సార్లు దువ్వడం వల్ల జుట్టు లాగినట్టుగా అవుతుంది. జట్టు కుదుళ్లు పాడవుతాయి. జుట్టు కొనలు చిట్లుతాయి. అలాగే ఎలాంటి జుట్టుకు ఎలాంటి దువ్వెన వాడాలో తెలియకపోతే కష్టమే.. ఒత్తుగా, కర్లీగా ఉన్న జుట్టుకు పళ్లు వెడల్పుగా ఉన్న దువ్వెన వాడాలి. స్టయిలింగ్ కు రౌండ్ బ్రీజిల్స్ ఉన్న దువ్వెన వాడాలి. బాగా చిక్కు పడే జుట్టుకు బ్రష్ ను ఎంచుకోవాలి. మీ హెయిర్ టైప్ ని బట్టి దువ్వెనను ఎంచుకోవాలి. 

చిట్లిన వెంట్రుకల కోసం:

హెయిర్ కట్ ని కొంత కాలం పాటు వాయిదా వేస్తుంటే జట్టు బాగా డ్రైగా తయారవుతుంది. జుట్టు కొసలు చిట్లుతాయి. పొట్టి జుట్టు ఉన్న వాళ్లకు జుట్టు ఎంత పెరుగుతుందో గమనించడం తేలికే.. కానీ పొడుగు జుట్టు ఉన్న వాళ్లు ఎప్పుడు హెయిర్ కట్ చేయించుకోవాలో చూసుకోవడం కొద్దిగా కష్టం అవుతుంది. పొడుగు జుట్టు ఉన్న వారికి జుట్టు కొసలు చిట్లడం కూడా ఎక్కువగానే ఉంటుంది. రెండు నెలలకు ఒకసారైనా హెయిర్ ట్రిమ్ చేయించుకోవాలి. ఒకసారి వెంట్రుకలు చిట్లాక ఏ షాంపూ, నూనె కూడా దాన్ని సరి చేయలేదు. 

నూనె పెట్టడం మంచిదే:

చాలా మంది జుట్టుకు నూనె పెట్టుకోవడం చాదస్తం అనుకుంటారు. నిజానికి జుట్టుకు తగినంత పోషణ ఇచ్చేది నూనెలే. చాలా రకాల హెయిర్ ప్రాబ్లమ్స్ కి ఆయిల్ పెట్టడమే పరిష్కారం. తలస్నానానికి ముందు నూనె పెట్టడం వలన మీ జుట్టు చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది. ఇందుకు కొబ్బరి నూనె, నువ్వుల నూనె, ఆలివ్ ఆయిల్ బాగా ఉపయోగపడతాయి. అయితే రోజంతా అలా జిడ్డు తలతో ఉండడం బాగుండదు. జుట్టుకు కూడా మంచిది కాదు.  

Leave a Comment