వరుడుకు స్వాగతం పలుకుతూ.. పెళ్లి కూతురు అదిరిపోయే స్టప్పులు.. అస్సలు మిస్సవొద్దు..!

పెళ్లి అనేది జీవితంలో కీలకమైన వేడుక. జీవితంలో ఒకేసారి జరిగే ఘట్టం.. ఈ ఘట్టాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. తమ పెళ్లి వేడుక అందరికంటే ప్రత్యేకంగా ఉండాలని ఆశిస్తారు..

తాజాగా అలా ప్రయత్నించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెళ్లి కొడుక్కి స్వాగతం పలుకుతూ ఓ సాంగ్ వస్తుంది. ఆ పాటకు పెళ్లి కూతురు డ్యాన్స్ తో అదరగొట్టింది. వాహనం ఎదుట పెళ్లికొడుక్కి స్వాగతం పలుకుతూ డ్యాన్స్ చేసింది. ఆమె డ్యాన్స్ తో పెళ్లి కొడుకు రెండు స్టెప్పులు కలిపాడు. 

చివర్లో బంధువులు, స్నేహితులు వధువుతో కలిసి పదం, పాదం కలిపారు. ఇలా పెళ్లి కూతురు డ్యాన్స్ చేసిన వీడియో అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఈ డ్యాన్స్ సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. ఇది ఎక్కడ జరిగిందో తెలీదు కానీ.. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఆమె డ్యాన్స్ ను మెచ్చుకుంటున్నారు. ఈ వీడియోను మీరు చూసేయండి..

Leave a Comment