కాబోయే వాడిని పరిచయం చేసిన రకుల్.. బర్త్ డే సందర్భంగా ప్రకటన..!

టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు.. ఈ బ్యూటీ అక్టోబర్ 10న తన 31వ పుట్టినరోజు జరుపుకుంది. ఈ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియా వేదికగా తనకు కాబోయేవాడిని రకుల్ పరిచయం చేసింది. బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్ననీతో ప్రేమలో ఉన్నట్లు అధికారికంగా ప్రకటించింది. 

ఇన్ స్టాగ్రామ్ లో జాకీ భగ్నానీ చేతిని పట్టుకుని నడుస్తున్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘థాంక్యూ మై లవ్.. నువ్వు నాకు ఈ సంవత్సరం దొరకిన గొప్ప బహుమతి.. నువ్వు నా జీవితానికి రంగులు అద్దావు.. నా జీవితంలో నాన్ స్టాప్ నవ్వులను యాడ్ చేశావు.. ఇలా ఇద్దరం కలిసి ఎన్నో మధుర జ్ఞాపకాలను తయారు చేసుకుందాం’ అంటూ హార్ట్ ఎమోజీలతో తన పోస్ట్ ను నింపింది. ఇక వీరిద్దరి ప్రేమ పెళ్లి పీటల వరకు చేరాలని మనం మనస్పూర్తిగా కోరుకుందాం.. రకుల్ తన ప్రియుడికి చెందిన సంస్థలోనే తన తరువాతి సినిమా అక్షయ్ కుమార్ తో చేయబోతోంది..  

 

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)

Leave a Comment