‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు.. విష్ణు విన్నింగ్ పాయింట్స్ ఇవే..!

‘మా’(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికల్లో హీరో మంచు విష్ణు విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో భారీ మెజార్టీతో విష్ణు విజయం సాధించారు. ప్రత్యర్థి ప్రకాశ్ రాజ్ పై 127 ఓట్ల మెజారిటీతో గెలిచి ‘మా’ అధ్యక్ష పదవిని విష్ణు కైవసం చేసుకున్నాడు. ప్రధాన పోస్టుల్లో కూడా మంచు విష్ణు ప్యానల్ కు సంబంధించిన వారే విజయం సాధించారు. ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి శ్రీకాంత్ ఒక్కరే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా గెలుపొందారు.

విష్ణు ప్యానల్ లో గెలిచిన సభ్యులు:

అధ్యక్షుడు – మంచు విష్ణు

జనరల్ సెక్రటరీ – రఘుబాబు

వైస్ ప్రెసిడెంట్ – మాదాల రవి

ట్రెజరర్ – శివబాలాజి

జాయింట్ సెక్రటరీ – గౌతం రాజు

ప్రకాశ్ రాజ్ ప్యానల్ లో గెలిచిన సభ్యులు:

వైస్ ప్రెసిడెంట్ – హేమ

జాయింట్ సెక్రటరీ – ఉత్తేజ్

ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ – శ్రీకాంత్

విష్ణు విజయానికి ప్లస్ అయిన అంశాలు ఇవే.. 

  • మంచు విష్ణుకు పెద్ద ప్లస్ పాయింట్ ఆయన తండ్రి మోహన్ బాబు..
  • తండ్రి సాయంతో ఇండస్ట్రీలో పెద్ద కుటుంబాల మద్దతు సంపాదించుకున్నారు. 
  • యువకుడు కావడం ఓ ప్లస్ పాయింట్..
  • విష్ణుకు విద్యాసంస్థలు నడుపుతున్న ఎక్స్ పీరియన్స్. 
  • తెలుగువాడినన్న ప్రచారం. 
  • ఇక మంచు ఫ్యామిలీకి రాజకీయ పార్టీలతో అనుబంధం..
  • మంచి మేనిఫెస్టోతో ‘మా’ సభ్యులను ఆకట్టుకున్నారు..
  • ముఖ్యంగా పోలింగ్ రోజు ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న సభ్యులను సైతం సంప్రదించి హైదరాబాద్ రప్పంచుకోగలిగారు.

ప్రకాశ్ రాజ్ బలహీనతలు

  • ప్రకాశ్ రాజ్ నాన్ లోకల్ కావడం..
  • ప్రకాశ్ ఇండస్ట్రీలో పెద్దల సాయం అస్సలు వద్దని, తనకు ఎవరి మద్దతు అక్కర్లేదని స్టేట్మెంట్ ఇవ్వడం..
  • ఆయన యాంటీ హిందూ అనే వాదన కూడా ఉంది.  
  • ఆయనకు కోపిష్టి ముద్ర ఉండటం..ఆవేశపరుడు కావడం..
  • నడిగార్ సంఘంలోనూ వివాదాలు ఉండడం..
  • గతంలో ప్రకాశ్ రాజ్ ‘మా’ నుంచి సస్పెండ్ అయిన చరిత్ర ఉంది.
  • ఇక ముఖ్యంగా మేనిఫెస్టోలో క్లారిటీ లేకపోవడం.. 

Leave a Comment