ఆవుల కోసం రూ.11 కోట్ల ఆస్తిని విరాళమిచ్చి.. ఆధ్యాత్మిక మార్గంలోకి ఆభరణాల వ్యాపారి..!

కోట్ల ఆస్తిని దానం చేసి నిరాడంబరమైన జీవితాన్ని గడపడం మనం ఎక్కువగా రజనీకాంత్ సినిమాల్లో చూసి ఉంటాం.. కానీ మధ్యప్రదేశ్ లోని బాలా ఘాట్ కు   చెందిన ఆభరణాల వ్యాపారి రాకేశ్ సురానా రూ.11 కోట్ల ఆస్తిని విరాళంగా ఇచ్చారు. గోశాల, ఆధ్యాత్మిక సంస్థలకు ఆస్తిని రాసిచ్చారు. అంతేకాదు తన భార్య లీనా సురానా, కుమారుడు అమయ్ సురానాతో కలిసి ఆధ్యాత్మిక జీవితం గడపాలని నిర్ణయించుకున్నాడు. ఈనెల 22న జైపూర్ లో దీక్ష స్వీకరించనున్నారు.  

ఈ కుటుంబం తీసుకున్న గొప్ప నిర్ణయాన్ని ప్రశంసిస్తూ.. వారిని రథంలో ఊరిగించారు స్థానికులు.. వారిని సన్మానించారు. గురు మహేంద్ర సాగర్ స్ఫూర్తితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాకేశ్ సురానా తెలిపారు. డబ్బు సంపాదించి సుఖంగా ఉండటమే జీవితం కాదని, మనమేంటో గుర్తించడమే జీవిత పరమార్థమని అన్నారు. 

Leave a Comment