‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ టోపీ ఎందుకు ధరిస్తాడో.. లీక్ చేసిన రాజమౌళి తండ్రి..!

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో కొమరం భీమ్ పాత్రను పరిచయం చేసినప్పుడు ఎన్టీఆర్ ను ముస్లిం గెటప్ లో చూపించాడు. జూనియర్ ఎన్టీఆర్ ముస్లిం టోపీ పెట్టుకోవడం పట్ల తీవ్ర దుమారం రేపింది. 

ఈనేపథ్యంలో దర్శకుడు రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ విషయంపై ట్విస్టును లీక్ చేశారు. కొమరం భీమ్ టోపీ పెట్టుకోవడానికి గల కారణాన్ని ఆయన వివరించారు. సినిమాలో నిజాం నవాబులు భీమ్ ను పట్టుకోవాలని ప్రయత్నిస్తూ ఆయన్ను వెంటాడ్తారని, నిజాం పోలీసుల నుంచి తప్పించుకోవడానికి కొమరం భీమ్ ముస్లిం యువకుడిగా మారుతాడని, అప్పుడు ముస్లిం టోపీ ధరిస్తాడని విజయేంద్రప్రసాద్ వివరణ ఇచ్చారు. 

ఇక సీతారామజారు పాత్రలో నటించిన రామ్ చరణ్ ను పోలీస్ పాత్రలో చూపించడానికి కూడా ఒక కారణం ఉందన్నారు. వెండితెరపై అది ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని ఇస్తుందని తెలిపారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ ల ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకునే ‘ఆర్ఆర్ఆర్’ కథను తయారు చేశామని విజయేంద్రప్రసాద్ స్పష్టం చేశారు.     

Leave a Comment