ఐదు కొమ్ములతో వింత గొర్రె..!

సాధారణంగా గొర్రెకు రెండు కొమ్ములు ఉంటాయి. కానీ నైజీరియాలో ఓ గొర్రె ఐదు కొమ్ములతో దర్శనమిచ్చింది. దీంతో ప్రజలు ఆ ఐదు కొమ్ముల గొర్రెను వింతగా చూశారు. బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లింలు గొర్రెలను ఖుర్బానీ ఇస్తుంటారు.  జూలై 21న బక్రీద్ సందర్బంగా నైజీరియాలోని లాగోస్ మార్కెట్ లో గొర్రెల విక్రయం జోరుగా సాగింది. 

మార్కెట్ లో ఓ వ్యక్తి గొర్రెను అమ్మేందుకు తీసుకొచ్చాడు. ఆ గొర్రెకు ఐదు కొమ్ములు ఉండటంతో అందరినీ ఆకర్షించింది. నెత్తి మీద కిరీటం పెట్టినట్టుగా ఆ గొర్రె కొమ్ములు ఉన్నాయి. చూడటానికి స్టాట్యూ ఆఫ్ లిబర్టీ తలపై ఉన్న కిరీటం మాదిరిగా ఉంది. గొర్రెలను కొనుగోలు చేసేందుకు వచ్చినవారు ఆ గొర్రెతో ఫొటోలు దిగారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు పలు విధాలుగా స్పందిస్తున్నారు. ఈ గొర్రె ప్రమాదానికి సూచనగా కనిపిస్తోందని, ఇది కలియుగానికి సంకేతమని కొందరు కామెంట్లు చేస్తున్నారు. 

Leave a Comment