వచ్చే రెండు రోజులు భారీ వర్షాలు..!

వాయువ్య బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దీని ప్రభావంతో వచ్చే రెండ్రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సీఎం జగన్ అన్నారు. భారీ వర్షాలపై ఎప్పటికప్పుడు కలెక్టర్లు సమీక్ష నిర్వహించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో పలుచోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. 

గురు, శుక్రవారాల్లో కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఈ స్థాయి వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. గుంటూరు, శ్రీకాకుళం, కర్నూలు, కడప జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగిలిన జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీరం వెంబడి గంటకు 50-60 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. 

  

 

Leave a Comment