సినిమా ఫ్లాప్ అయ్యిందని.. ప్రభాస్ అభిమాని ఆత్మహత్య..!

ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా ఫ్లాప్ అయ్యిందని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. కర్నూలు తిలక్ నగర్ కి చెందిన ముత్యాల రవితేజ(24) వెల్డింగ్ పని చేస్తుంటాడు. తల్లి రోజూవారీ కూలీ పనులు చేస్తుంది. రవితేజ హీరో ప్రభాస్ కి పెద్ద ఫ్యాన్.. 

ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా ఈ శుక్రవారం విడుదలైంది. విడుదల రోజే రాధేశ్యామ్ సినిమాను చూశాడు రవితేజ. ఎన్నో అంచనాలతో విడుదలైన రాధేశ్యామ్ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. సినిమా ఫ్లాప్ కావడంతో రవితేజ మనస్తాపం చెందాడు. ఫ్రెండ్స్ తో కలిసి సినిమా ఫ్లాప్ అయ్యిందని బాధపడ్డాడు. 

ఇంట్లో తన తల్లితో కూడా ఇదే చెప్పాడు. శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రవితేజ తల్లి ఎన్ని సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. దీంతో కంగారు పడ్డ ఆమె రవితేజ స్నేహితులు, బంధువులకు ఫోన్ చేసి విషయం చెప్పింది. వారు ఉదయం రవితేజ ఇంటికి వెళ్లి తలుపు తట్టినా స్పందించలేదు. వెల్డింగ్ యంత్రంతో ఘడియను తొలగించి చూడగా ఇంట్లోని ఫ్యాన్ కి ఉరి వేసుకొని కనిపించాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.   

Leave a Comment