అరచేతి సైజ్ చూసి భవిష్యత్ తెలుసుకోవచ్చట..!

జ్యోతిషులు చేతులు చూసి భవిష్యత్ ఎంటో చెబుతుంటారు. మనలో చాలా మంది చేతి రాతలను నమ్ముతారు కూడా. ఇటీవల విడుదలైన రాధేశ్యామ్ సినిమాలోనూ హీరో జ్యోతిషుడిగా నటించాడు. చేతులు చూసి భవిష్యత్తు చెబుతాడు. అవి 99 శాతం నిజమవుతుంటాయి.. నిజజీవితంలోనూ జ్యోతుష్య శాస్త్రానికి మంచి ఆదరణ ఉంది. 

అయితే చేతిలో రేఖలు, చేతి సైజ్ లను బట్టి భవిష్యత్ ఎలా చెబుతారు? దీనికి ఓ లాజిక్ ఉంది. కొన్ని సాధారణ లక్షణాలను బట్టి వారి స్వభావం, వారి జీవితం ఎలా ఉంటుంది అనేది చెబుతుంటారు జ్యోతిషులు. చేతి సైజ్ ని బట్టి భవిష్యత్ ఎలా చెబుతారో ఇప్పుడు చూద్దాం.. 

అర చెయ్యి పెద్దగా ఉంటే :

అర చెయ్యి పెద్దగా ఉన్న వారు జీవితాన్న ఆనందంగా గడుపుతారట. వీరు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉండటానికి ఇష్టపడరు. ముఖ్యంగా పనిలో వచ్చే చిన్న చిన్న ఆటంకాలను కూడా వీరు సహించలేరు. 

చెయ్యి మృదువుగా ఉంటే:

జ్యోతిష శాస్త్రం ప్రకారం చెయ్యి  మృదువుగా ఉన్న వారు చాలా పవిత్రంగా ఉండేందుకు, వీరు విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకు ఇష్టపడతారట. జీవితంలో ప్రతి చిన్న విషయంలో ఆనందాన్ని పొందాతరట.

అర చెయ్యి దృఢంగా, ముదురుగా ఉన్నవారు:

ఇలాంటి వ్యక్తులు కర్మను ఎక్కువగా నమ్ముతారట. అదృష్టంపై ఎక్కువగా ఆధారపడరు. తాము చేసే పనిపై పూర్తి నమ్మకం పెడతారట. టైమ్ వేస్ట్ చేయడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు. 

అర చెయ్యి చిన్నగా ఉంటే:

ఇలాంటి వ్యక్తులు స్వచ్ఛమైన హృదయంతో ఉంటారు. ఎవరికీ హాని చేయాలని అనుకోరు. ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకునేందుకు ఇష్టపడతారు. 

ఎర్రటి అర చెయ్యి ఉన్నవారు:

అర చేతులు ఎర్రగా ఉన్న వారు అదృవంతులట. వారికి ఆస్తి, ఐశ్వర్యంతో పాటు సంఘంలో గౌరవం కూడా ఉంటుందని చెబుతున్నారు సాముద్రిక నిపుణులు. జీవితాంతం ఆనందంగా గడుపుతారట.. 

ఇవి కేవలం సాముద్రిక నిపుణులు అభిప్రాయాలు మాత్రమే. తాము వీటిని ధ్రువీకరించలేదు. 

Leave a Comment