వీటిలో తక్కువ కులం ఏదీ?.. పరీక్షలో కులం గురించి ప్రశ్న..!

తమిళనాడు పెరియార్ యూనివర్సిటీ పరీక్షల్లో కులం గురించి ప్రశ్న అడగడం వివాదాస్పదమైంది.. ఎంఏ హిస్టరీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. గురువారం ‘ఫ్రీడం మూవ్ మెంట్ ఆఫ్ తమిళనాడు 1800-1947’ అనే సబ్జెక్టుకు పరీక్ష జరిగింది. ఈ పరీక్ష ప్రశ్నాపత్రంలో ‘కింది వాటిలో తమిళనాడుకు చెందిన తక్కువ కులం ఏదీ?’ అని ప్రశ్న వచ్చింది.. 

పరీక్షల్లో కులం గురించి ప్రశ్న అడగడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. సమాజాంలో అసమానతలు రూపుమాపే దిశగా విద్యను అందించాల్సిన ప్రొఫెసర్లు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. 

తాము తయారు చేయలేదు..

‘ప్రశ్నాపత్రం తాము తయారు చేయలేదు. వేరే యూనివర్సిటీ సిబ్బంది తయారు చేసింది. పరీక్ష జరిగే వరకు ప్రశ్నాపత్రాన్ని ఎవరూ చూడలేదు. ప్రశ్నాపత్రంలో వివాదాస్పద ప్రశ్న గురించి తమకు ఎటువంటి సమాచారం అందలేదు. ఈ విషయంపై విచారణ జరుపుతాం’. అంటూ పెరియర్ యూనివర్సిటీ ఉప కులపతి జగన్నాథన్ వివరణ ఇచ్చారు. 

Leave a Comment