ఏపీలో అక్టోబర్ 2 నుంచి నాణ్యమైన బియ్యం

ఏపీలో అక్టోబర్ 2 నుంచి నాణ్యమైన బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గాంధీ జయంతి నుంచి లబ్ధిదారులకు రేషన్ బియ్యాన్ని నేరుగా ఇళ్ల వద్దకే అందించనుంది. అయితే గతంలో సెప్టెంబర్ లోనే నాణ్యమైన బియ్యం సరఫారా చేయాలనుకుంది. కానీ కొన్ని కారణాల వల్ల గాంధీ జయంతి నుంచి నాణ్యమైన రేషన్ బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రేషన్ బియ్యాన్ని ప్యాకింగ్ చేసి అందించాలన్న ఆలోచనను ప్రభుత్వం విమరమించుకుంది. బియ్యం ప్యాకింగ్ కోసం రూ.400 కోట్లు ఖర్చవుతుంది. ఆ ఖర్చును తగ్గించి ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చే విధంగా ఈ నిర్ణయం తీసుకుంది. బియ్యం పంపిణీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 13 వేల ట్రాలీలను సిద్దం చేయనుంది. 

 

Leave a Comment