కరోనా వైరస్ కు మార్కెట్లో మెడిసిన్..ఒక్కో టాబ్లెట్ ధర రూ.103

కరోనా వైరస్ చికిత్స కోసం ఫాబి ఫ్లూ బ్రాండ్ పేరుతో యాంటీ వైరస్ డ్రగ్ ఫావిపిరవిర్ ను లాంచ్ చేసినట్లు ముంబైకి చెందిన డ్రగ్ సంస్థ గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ శనివారం వెల్లడించింది. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) నుంచి మార్కెటింగ్ అనుమతి కూడా లభించినట్లు పేర్కొంది. భారతదేశంలో కరోనా కేసులు మునుపెన్నడూ లేని విధంగా పెరుగుతున్న తరుణంలో ఈ ఆమోదం లభించింది. 

కరోనా బాధితుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వైరస్ తీవ్రత ఉన్నవారికి ఫబిఫ్లూతో చికిత్స మంచి ఫలితాలను ఇస్తుందని సంస్థ తెలిపింది. కోవిడ్-19 చికిత్స కోసం భారతదేశంలో ఉపయోగించే మొట్టమొదటి మందు ఫాబిఫ్లూ అని పేర్కొంది. 

ఇక 34 టాబ్లెట్ల స్ట్రిప్ ధర రూ.3500 గా నిర్ణయించినట్లు పేర్కొంది.. అంటే ఒక్కో టాబ్లెట్ ధర రూ.103గా నిర్ణయించారు. 1800 ఎంజీ మాత్రలు రోజు ఒకటి, 800 ఎంజీ మాత్రలు రోజూ రెండు చొప్పున వైద్యుల సలహామేరకు వాడాలని సూచించింది. 

 

                                                                                                                                                                                                                                                                               

Leave a Comment