గిన్నిస్ రికార్డు నెలకొల్పిన హీరో బాలకృష్ణ బర్త్ డే..

ఈ నెల 10 హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ జన్మదిన వేడుకలు జరిగిన విషయం అందరికీ తెలిసిందే..  బాలయ్య బర్త్ డేకు ఆయన అభిమానులు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. అయితే అది నేరుగా ఇవ్వలేదు..కాని జీవితంలో మరిచిపోలేని గిఫ్ట్ అయితే ఇచ్చారు. ఆయన బర్త్ డేకు అయన అభిమానులు ఒకే సమయంలో 21 వేల కేకులు కట్ చేసి వరల్డ్ రికార్డును నెలకొల్పారు. 

కరోనా వైరస్ నేపథ్యంలో తన బర్త్ డేను చాలా సింపుల్ గా జరపాలని, అందరూ జాగ్రత్తులు పాటించాలని, అదే తనకు ఇచ్చే పెద్ద గిఫ్ట్ అని బాలయ్య తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఇక తన ఫ్యాన్స్ ఇంట్లోనే ఉండి..తమ అభిమాన హీరో బర్త్ డేను సెలబ్రేట్ చేసి రికార్డు సృష్టించారు.

జూన్ 10న ఉదయం 10 గంటల 10 నిమిషాల 10 సెకన్లకు 21 వేల కేకులను కట్ చేశారు. ఈ వేడుకలను ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిర్వహించారు. దాదాపు 80 వేల మంది ఈ వేడుకల్లో భాగస్వాములు అయ్యారు. ఈ వేడుకను వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, గిన్నీస్ బుక్ ఆప్ రికార్డ్స్ ప్రతినిధులు పర్యవేక్షించారు. ఇంకేముంది..ఆ వేడుకలను వరల్డ్ రికార్డుగా ప్రకటించారు. ప్రస్తుత పరిస్థులు కుదుటపడ్డాక సంబంధిత పత్రాలను బాలయ్యకు అందజేయనున్నట్లు సంస్థ  ప్రతినిధులు వెల్లడించారు. 

Leave a Comment