గంగిరెద్దుకు క్యూఆర్ కోడ్.. వీడియో షేర్ చేసిన కేంద్ర మంత్రి..!

ఇండియాలో డిజిటల్ చెల్లింపులు భారీగా పెరిగిపోయాయి. టెక్నాలజీ పెరగడంతో ఫోన్ లోని యాప్స్ ద్వారానే లావాదేవీలు నిర్వహిస్తున్నారు. సూపర్ మార్కెట్ నుంచి టీ స్టాల్ వరకు ఎక్కడ చూసినా ఫోన్ పే, గూగుల్ పే క్యూఆర్ కోడ్ లు దర్శనమిస్తున్నాయి. నగరాల్లోనే కాదు.. గ్రామాల్లోనూ ఈ డిజిటల్ చెల్లింపులు అధికమయ్యాయి. 

దేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవానికి సంబంధించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓ వీడియో షేర్ చేశారు. ఇంటింటికీ తిరిగే గంగిరెద్దులను ఆడించే వారు సైతం డిజిటల్ రూపంలో భిక్షాటన చేస్తున్న వీడియోను మంత్రి తన ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ వీడియోలో ఓ ఇంటి ముందు వచ్చిన గంగిరెద్దుపై ఫోన్ పే క్యూఆర్ కోడ్ ట్యాగ్ ఉంటుంది. ఓ వ్యక్తి ఆ క్యూఆర్ కోడ్ ద్వారా పేమెంట్ చేస్తాడు. డిజిటల్ చెల్లింపుల విప్లవం జానపద కళాకారుల వరకు చేరిందని నిర్మిలా సీతారామన్ రాసుకొచ్చారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో గంగిరెద్దుల వాళ్లు తమ ఎద్దులను అలంకరించి పండుగల సమయాల్లో ఇంటింటికీ తిరిగి నాదస్వరం ఊదుతూ భిక్షాటన చేస్తుంటారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.    

Leave a Comment