ఎన్టీఆర్ కుడి చేతికి గాయం.. సర్జరీ.. ఏమైందంటే..?

దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ లో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా కనిపించనున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను ఎన్టీఆర్ పూర్తి చేసుకున్నారు. మరోవైపు కొరటాల శివ దర్శకత్వంలో తారక్ ఓ సినిమా చేస్తున్నారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభంకానుంది. 

కాగా జూనియర్ ఎన్టీఆర్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఓ ఫొటో వైరల్ అవుతోంది. దీపావళి పండుగ సందర్భంగా తన కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ తో కలిసి దిగిన ఫొటోను తారక్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఆ ఫొటోను చూసిన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆ ఫొటోలో ఎన్టీఆర్ కుడి చేతికి గాయం కనిపిస్తోంది. దీంతో ఎన్టీఆర్ కి ఏమందని ఆయన అభిమానులు ఆరా తీస్తున్నారు. 

ఇంతకు ఎన్టీఆర్ కు ఏమైందంటే.. ఇటీవల ఎన్టీఆర్ తన ఇంటి జిమ్ లో వ్యాయామాలు చేస్తూ గాయపడ్డారు. వర్కౌట్స్ చేస్తుండగా కుడి చేతి వేలుకు గాయమైంది. దీంతో ఆయన కుడి చేతి వేలుకు నాలుగు రోజుల క్రితం మైనర్ సర్జరీ జరిగింది. అయితే కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు ఎన్టీఆర్..  

 

View this post on Instagram

 

A post shared by Jr NTR (@jrntr)

Leave a Comment