ఆ హీరో వల్లే పెళ్లి చేసుకోలేదు.. టబు సంచలన వ్యాఖ్యలు..!

ఒకప్పుడు హీరోయిన్ టబు తన అద్భుత నటనతో టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలను ఏలింది. దశాబ్దం పాటు ఇండస్ట్రీలో తన హవా కొనసాగించింది. ఆ తర్వాత సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం గెస్ట్ రోల్స్ చేస్తూ ఆకట్టుకుంటోంది టబు.. నటిగా ఎంతో పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ మాత్రం ఒంటరిగా జీవితనం కొనసాగిస్తోంది. వయసు పైబడిపోతున్నా ఇంత వరకు ఆమె పెళ్లి చేసుకోలేదు. 

గతంలో ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించింది. ఆమె పెళ్లి చేసుకోకుండా ఉండటానికి కారణమైన హీరో పేరును వెల్లడించింది. తాను పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండటానికి బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్ గణ్ అని టబు వెల్లడించింది. అజయ్ దేవ్ గణ్ తో కలిసి టబు విజయ్ పథ్, హకీకత్, గోల్ మాల్ అగెయిన్, దృశ్యం, దేదే ప్యార్ దే సినిమాల్లో నటించింది.

అజయ్ తనకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసని చెప్పింది. అజయ్ తన సోదరుడి స్నేహితుడే అని, తాము అంతా జుహులోనే కలిసి పెరిగామని తెలిపింది. అజయ్ మాత్రం తాను ఎక్కడికి వెళ్లిన తన వెనకాలే వచ్చేవాడని, తనతో ఎవరైనా అబ్బాయిలు మాట్లాడితే మాత్రం సహించేవాడు కాదని చెప్పింది. అజయ్ దేవ్ గణ్ వల్లే తాను ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉన్నానని, దీనికి అజయ్ దేవ్ గణే బాధ్యుడని టబు చెప్పుకొచ్చింది.  

 

Leave a Comment