‘మటన్ కావాలా.. నేను కావాలా తేల్చుకో’.. భర్త అల్టిమేటం..!

భార్యాభర్తల మధ్య మటన్ చిచ్చుపెట్టింది. ఏంటీ నమ్మడం లేదా.. అవునండీ ఇది నిజమే.. ఇలాంటి స్టోరీ మీరు ఎక్కడా చూసుండరు..ఇది భార్య, భర్త, మటన్ మధ్య జరిగే ట్రయాంగిల్ లవ్ స్టోరీ..  మరీ ఆ వివరాలేంటో తెలుసుకుందామా.. ఓ వ్యక్తి ప్యూర్ వెజిటేరియన్.. మాంసం ముక్క కూడా ముట్టడు. అలాంటి వ్యక్తికి ఓ అందమైన యువతితో పెళ్లి జరుగుతుంది..ఆమె కుటుంబం కూడా శాకాహారులే.. 

ప్యూర్ వెజిటేరియన్ కుటుంబంలో పుట్టిన ఆమె అనుకోకుండా ఓరోజు మటన్ తన్నది.. అంతే ఆమె మటన్ కి బానిసై పోయింది. ఇంట్లో తెలియకుండా అప్పుడప్పుడు మటన్ లాగించేది.. అయితే తనకు మటన్ తినే అలవాటు ఉందని పెళ్లి చూపుల సమయంలో భర్తకు చెప్పింది. 

అయితే ఆమె అందంగా ఉండడంతో వదులుకోలేకపోయాడు. ఆమెనే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయిన తర్వాత మాంసాహారం జోలికి వెళ్లనని ఆమెతో మాట తీసుకున్నాడు. అయితే ఆ మహిళ భర్తకు ఇచ్చిన మాట నిలుపుకోలేకపోయింది. భర్తకు తెలియకుండా రహస్యంగా మటన్ తినసాగింది. 

ఈ విషయాన్ని తెలుసుకున్న భర్త ఇదేంటని నిలదీశాడు. ఆమె మాత్రం తాను మటన్ తినకుండా తెగేసి చెప్పేసింది. దీంతో మటన్ కావాలో భర్త కావాలో తేల్చుకో అని అల్టిమేటం జారీ చేశాడు. చెప్పడం ఏమో చెప్పేశాడు.. కానీ ఇప్పుడు ఆ భర్తకు భయం పట్టుకుంది. ఒకవేళ ఆమె నిజంగానే మటన్ కావాలని అంటే తన పరిస్థితి ఏంటని ఆలోచించాడు.   

ఈక్రమంలో ఓ ఫ్యామిలీ కౌల్సిలర్ కి లెటర్ రాశాడు. ఇంతకు తన భార్య ఎవరిని ఎంచుకుంటుందని మీరు భావిస్తున్నారని వారిని ప్రశ్నించాడు. దీనికి ఆ ఫ్యామిలీ కౌన్సిలర్ తనదైన స్టయిల్ లో సమాధానం ఇచ్చాడు. ‘కంగ్రాట్స్. మీరు వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారు. నాకు తెలిసి ఓ భార్య, ఓ భర్త, మటన్ మధ్య ఇదే తొలి ట్రాయంగిల్ లవ్ స్టోరీ అనుకుంటా.. నా అభిప్రాయం ఏంటంటే.. ఎవరైనా ప్రేమ లేకుండా ఉండగలరేమో కానీ.. తిండి లేకుండా ఉండలేరు కదా.. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి.. మీ భార్య ఎవరిని ఎంచుకుంటుందో..’ అంటూ సమాధానం చెప్పాడు. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఓ పేపర్ లో వచ్చింది. ప్రస్తుతం ఈ  స్టోరీ క్లిప్పింగ్ సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. మరీ ఆమె ఎవరినీ ఎంచుకుంటుందో మీరు చెప్పగలరా?     

 

Leave a Comment