‘నేను రిటైర్ అయ్యాను’ అంటూ పీవీ సింధూ షాకింగ్ ట్వీట్..!

బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధూ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ బ్యాడ్మింటన్ అభిమానులను షాక్ కు గురిచేస్తోంది. ‘ డెన్మార్క్ ఓపెన్ నా చివరి ఆట, ఐ రిటైర్ట్’ అంటూ చేసిన ట్వీట్  సంచలనంగా మారింది. బ్యాడ్మింటన్ కు రిటైర్మెంట్ అంటూ ప్రకటించడంతో అందరూ ఒక్కసారిగా నివ్వరపోయారు. సింధూ నిజంగానే ఆటకు గుడ్ బై చెపిందా? అసలు ఏముంది ఆ ట్వీట్ చూస్తే అర్థమవుతుంది. 

‘కరోనా మహమ్మారి నాకు కనువిప్పుగా మారింది. నా ప్రత్యర్థితో పోరాడటానికి కఠోరమైన శిక్షణ తీసుకునేదాన్ని. చివరి వరకు పోరాడేదాన్ని. ఇంతకు ముందు చేశాను, ఇకపై కూడా చేయగలను. కానీ,కంటికి కనిపంచని వైరస్ ను ఎలా ఓడించగలను, నెలలు గడుస్తున్నాయి. బయటకు వెళ్లాలనుకునే ప్రతీసారి ఆలోచిస్తున్నాను. విశ్రాంతి లేని ఆటకు స్వస్తి పలకాలని నిశ్చియించుకున్నాను. నెగిటివిటీ, భయం, అనిశ్చితి నుంచి రిటైర్ట్ అవ్వబోతున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. 

ప్రతి రోజూ సోషల్ మీడియాలో చదువుతున్న కథనాలు తనను తానే ప్రశ్నించుకునేలా చేశాయని తెలిపారు. మనం మరింత సంసిద్ధంగా ఉండాలని, కలిసికట్టుగా వైరస్ ను ఓడించాలని పేర్కొంది. మనం ఇప్పుడు తీసుకునే నిర్ణయం మన భావితరాల భవిష్యత్తును నిర్ణయిస్తుందని, వారిని ఓడిపోనివ్వకుండా చూడాలని ట్వీట్ లో తెలిపారు. 

డెన్మార్క్ ఓపెన్ జరగలేదని, కానీ తాను ప్రాక్టీస్ చేయడం మానలేదని, ఏషియా ఓపెన్ కు ప్రిపేర్ అవుతున్నానని పేర్కొన్నారు. దేన్ని కూడా సులభంగా వదిలి పెట్టడం తనకు ఇష్టం లేదన్నారు. ప్రపంచం మొత్తం మీద పరిస్థితులు చక్కబడే వరకు పోరాడుతూనే ఉంటానని ప్రకటించింది. అయితే సింధూ చేసిన ట్వీట్ కాస్త గందరగోళంగా ఉండటంతో అభిమానులు మండిపడ్డారు. సింధూ బాడ్మింటన్ కు రిటైర్మెంట్ ప్రకటించినట్లు పొరపడ్డారు. కరోనాపై ప్రజలు ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉండరాదనే సందేశాన్ని సింధూ ట్వీట్ లో ఇచ్చారు.   

Leave a Comment