భారత్ యుద్ధం చేస్తుందని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వణికిపోయారు..!

భారత వైమానిక దళ పైలట్ అభినందన్ వర్ధమాన్ ను పాక్ ఆర్మీ అదుపులోకి తీసుకుప్పుడు పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ బజ్వా వణికిపోయారని, ఇండియా పాకిస్తాన్ పై యుద్ధం చేయబోతుందన్న విషషయం తెలియగానే ఆయనకు చెమటలు పట్టాయని పాకిస్థాన్ ముస్లిం లీగ్ పార్టీ నేత అయాజ్ సాధిక్ వెల్లడించారు.

 పుల్వామా దాడి అనంతరం భారత వైమానిక దళం పాక్ ఆక్రమిత కశ్మీర్ లోకి ప్రవేశించి ఉగ్రవాత స్థావరాలను పేల్చివేసింది. ఆ తర్వాత పాక్ విమానాలు ఇండియాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నం చేశాయి. అయితే వింగ్ కమాండర్ అభినందన్ మిగ్ విమానాలతో పాక్ కు చెందిన ఎఫ్ 16 విమానాన్ని కూల్చివేశాడు. అనంతరం అభినందన్ పాక్ అధికారులకు దొరికిపోయాడు.  

కాగా ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ అయాజ్ సాదిఖ్ బుధవారం నేషనల్ అసెంబ్లీలో ప్రసంగించారు. అభినందన్ వర్ధమాన్ విడుదల నాటి పరిస్థితులను ఆయన గుర్తు చేసుకున్నారు. ఆరోజు పాక్ విదేశాంగశాఖ మంత్రి ఖురేషి పార్లమెంట్ నేతలతో సమావేశం ఏర్పాటు చేశారని, ఆ మీటింగ్ కు పాక్ ఆర్మీ జనరల్ బజ్వా కూడా హజరయ్యారని అన్నారు. 

అభినందన్ ను వెంటనే విడుదల చేయకపోతే భారత్ తమపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉందని ఖరేషి మీటింగ్ లో చెప్పినట్లు అయాజ్ సాధిక్ పేర్కొన్నారు. ఈ విషయం చెప్పిన వెంటనే ఆర్మీ జనరల్ బజ్వాకు చెమటలు పట్టాయని, కాళ్లు, చేతులు వణికాయని తెలిపారు.  అందుకే హడావుడిగా మార్చి 1న అభినందన్ ను ఇండియాకు అప్పగించారన్నారు. 

Leave a Comment