బిగ్ బాస్-4 హౌజ్ డ్రోన్ వీడియో వైరల్..

  నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్-4 ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటికే ఈ షో 56 రోజులు పూర్తి చేసుకుంది. ఈ ప్రయాణంలో  ఎన్నో ఆటుపోట్లతో పాటు ఎన్నో విశేషాలు ఉన్నాయి. 7వ వారంలో కొత్తగా నాగార్జున హోస్ట్ లేకుండా ఆయన కోడలు సమంత హోస్ట్ గా వ్యవహరించారు. దానికి మంచి  రెస్పాన్స్ కూడా వచ్చింది. నాగార్జున ‘వైల్డ్ డాగ్’ షూటింగ్ కోసం హిమాలయాలకు వెళ్లడంతో సమంత హోస్ట్ గా వ్యవహరించారు. అయితే 8వ వారంలో నాగార్జున ప్రత్యేక విమానంలో హైదరాబాద్ లో దిగి బిగ్ బాస్ షోలో పాల్గొన్నాడు. 

ఇదిలా ఉండగా బిగ్ బాస్ ఇంటి సెట్ ఎలా కనిపిస్తుందో డ్రోన్ కెమెరా ద్వారా చూపించాడు ఓ యూట్యూబర్. రోజూ హౌస్ లోపలే చూసే ప్రేక్షకులకు అన్నపూర్ణ స్టూడియోలోని సెట్ పరిచయం చేశాడు. ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. టీవీలో చేసినట్లు స్టూడియో, బిగ్ బాస్ బాస్ సెట్ రెండూ కలిసి ఉండవని ఈ వీడియో ద్వారా తెలుస్తోంది..

Leave a Comment