గుడ్ న్యూస్ : ప్రపంచంలో తొలి వ్యాక్సిన్ ను ప్రారంభించిన పుతిన్..!

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారు చేసేందుకు ప్రపంచ దేశాలు పోటీలో ఉన్నాయి. ఈ క్రమంలో ప్రపంచానికి తీపికబరు అందించింది రష్యా..ప్రపంచంలోనే తొలి వ్యాక్సిన్ ని అభివృద్ధి చేసినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ఇది కోవిడ్-19ను నిరోధించే వ్యాధి నిరోధకాలను కలిగి ఉందని స్పష్టం చేశారు. మొట్టమొదటి సారిగా ప్రపంచంలో కరోనా వైరస్ కు వ్యతిరేకంగా వ్యాక్సిన్ నమోదు చేసినట్లు పుతిన్ తన మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా చెప్పారు. 

తన ఇద్దరు కుమార్తెలకు వ్యాక్సిన్ వేయించినట్లు పుతిన్ ప్రకటించారు. ముందుగా వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ చేపడతామని వెల్లడించారు. మాస్కోలోని గమలేయ ఇన్ స్టిట్యూట్ ఈ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసింది. ఈ కోవిడ్-19 వ్యాక్సిన్ కు రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ రెగ్యులేటరీ ఆమోదం ఇచ్చింది. అయితే వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ చివరి స్టేజ్ కొనసాగుతున్నప్పటికీ, రష్యాలోని భారీ జనాభాకు వ్యాక్సిన్ అందించేందుకు త్వరగా అప్రూవ్ చేసినట్లు పుతిన్ వివరించారు. 

 

  

Leave a Comment