సుప్రీం కోర్టు సంచలన తీర్పు.. తండ్రి ఆస్తిలో కుమార్తెలకు సమాన హక్కు..!

మహిళల ఆస్తి హక్కుకు సంబంధించి సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. సవరించిన హిందూ వారసత్వ చట్టం 2005 ప్రకారం ఆస్తిలో కుమార్తెకు సమాన హక్కులు ఉంటాయని చెప్పింది. కొడుకులకు ఉండే అన్ని హక్కులు కూతుళ్లకూ వర్తిస్తాయని తెలిపింది. తండ్రి చనిపోయిన తర్వత కూడా కూతుళ్లకు ఈ హక్కులు వర్తిస్తాయని తీర్పునిచ్చింది. కూతుళ్ల ఆస్తి హక్కులకు సంబంధించి నెలకొన్న అనేక సందేహాలకు నేటి తీర్పుతో తెరపడింది. 

జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తల ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. హిందూ వారసత్వ చట్టంలో 2005 సవరణ ప్రకారం కుమార్తెలకు తండ్రి ఆస్తిలో అన్ని హక్కులు ఉంటాయని చెప్పింది. సవరణ సమయం 2005 సెప్టెంబర్ 9 నాటికి తండ్రి జీవించి ఉన్నారా లేదా అనే దానితో సంబంధం లేకుండా ఆమెకు వారసత్వ హక్కు ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. 

 

Leave a Comment