వీడియో వైరల్: సినిమాను మించి రియల్ ఛేజింగ్ సీన్.. మీరు చూడండి..!

సినిమాను మించిన రియల్ ఛేజింగ్ సీన్ పంజాబ్ లోని ఫిరోజ్ పుర్ లో జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో, ఒక ఇరుకు రోడ్డులో అడ్డొచ్చిన వారందరినీ గుద్దుకుంటూ కారు వేగంగా పోతోంది. 

ఆ కారు వెనుక మరో స్కార్పియో వాహనంతో పోలీసులు వెంబడిస్తున్నారు. రోడ్డుపై వాహనదారులను గుద్దుకుంటూ ఆ కారు ముందుకు తీసుకెళ్లారు. ఆసమయంలో రోడ్డుపై స్కూటీపై వెళ్తున్న ఓ మహిళను కారుతో ఢీకొట్టారు. ఆమె కింద పడిపోతుంది. అయినా ఆగకుండా వెళ్తారు. దీంత పోలీసులు తుపాకులతో వారిని వెంబడిస్తున్నారు. కారులో డ్రగ్స్ ముఠా ఉన్నట్లు తెలిసింది. చివరికి ఆ వ్యక్తులు దొరకడంతో కారులో తనిఖీ చేసి 10 గ్రాముల హెరాయిన్ పట్టుకున్నారు. కారులో వ్యక్తులను 10 కిలోమీటర్ల దూరం ఛేజ్ చేసి పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. 

Leave a Comment